For Money

Business News

కరుగుతున్న క్రిప్టో కరెన్సీలు

వారం రోజుల నుంచి మళ్ళీ క్రిప్టో కరెన్సీలలో అమ్మకాలు ఒత్తిడి వస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధ భయాల కారణంగా రెండు వారాల క్రితం 45,000 డాలర్లకు పైన ఉన్న బిట్ కాయిన్‌ ఇవాళ 40,000 డాలర్లకు దిగువకు వచ్చేసింది. ఇవాళ కూడా ఒక శాతంపైగా నష్టంతో 39982 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. షేర్‌ మార్కెట్‌లో ఒత్తిడితో మొదలైన పతనం… వాటితో పాటు కొనసాగుతోంది. ఇక ఎథీరియం ఇవాళ అయిదున్నర శాతం నష్టంతో 2736 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. టెథర్‌, బీఎన్‌బీ, యూఎస్‌డీ కాయిన్‌ .. అన్నీ స్థిరంగా లేదా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌ బాగా బలపడుతుండటంతో మన ఎక్స్ఛేంజీలల్లో బిట్ కాయిన్‌ పతనం జోరుగా ఉంది. ఇవాళ రెండు శాతంపైగా నష్టంతో రూ.31,47,900 వద్ద ట్రేడవుతోంది. ఎథెర్‌ 5 శాతం నష్టంతో రూ. 2,16,900 వద్ద కొనసాగుతోంది. పాలిగాన్‌, లైట్‌ కాయిన్‌ కూడా నాలుగు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.