For Money

Business News

రుణాలపై వడ్డీ రేట్ల పెంపు

ఆర్బీఐ రెపో రేట్లను పెంచడంతో వెంటనే బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. డిపాజిట్లపై ఇంకా కిమ్మనని బ్యాంకులు … అధిక వడ్డీ వచ్చే మార్గాలపై దృష్టి కేంద్రీకరించాయి. రెపో రేటు ఆధార ఇంటిరుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రకటించాయి. ఆర్బీఐ పాలసీ ప్రకారం రెపోరేటు ఆధారం I EBLR (ICICI Bank External Benchmark Lending Rate) ను 8.1 శాతానికి పెంచుతున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్‌ పేర్కొంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా BRLLR -(Baroda Repo Linked Lending Rate)ను 6.9 శాతానికి పెంచతున్నట్లు పేర్కొంది. 2019 అక్టోబర్‌ 1 నుంచి హౌసింగ్‌, రీటైల్‌ రుణాలకు ఎక్స్‌టర్ననల్‌ బెంచ్‌ మార్క్‌తో అనుసంధానిస్తూ కొత్త ఫ్లోటింగ్‌ రేటుకు ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది.