For Money

Business News

వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌

రాత్రి అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పావు శాతం మేర వడ్డీ రేట్లను పెంచిన 24 గంటల్లోపే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ కూడా వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ కూడా వడ్డీ రేట్లను పావు శాతం పెంచడంతో ఇపుడు ఆ దేశంలో వడ్డీ రేట్లు 0.75 శాతానికి చేరాయి. మళ్ళీ వడ్డీ రేట్లు పెంచాల్సి ఉంటుందా అన్న అంశంపై బ్యాంక్‌ క్లారిటీ ఇవ్వలేదు. అయితే పరిస్థితి సానుకూలంగా ఉండొచ్చని పేర్కొంది. ఏప్రిల్ నెలకల్లా ఇంగ్లండ్‌లో ద్రవ్యోల్బణం 8 శాతానికి చేరుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ అంచనా వేస్తోంది. ఆ తరవాత మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం కారణంగా యూరప్‌లోని అనేక దేశాల్లో ఇంధన చార్జీలు భారీగా పెరిగాయి. వచ్చే నెలలో మరో 50 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు.