For Money

Business News

నిఫ్టిని దెబ్బతీసిన బ్యాంక్‌ నిఫ్టి

ఊహించినట్లే ఆర్‌బీఎల్‌ బ్యాంక్ వ్యవహారం స్టాక్‌ మార్కెట్‌ను కుదిపేసింది. ఈ బ్యాంక్‌ సంక్షోభంలో కూరుకుపోతోందన్న వార్తలతో బ్యాంక్‌ నిఫ్టితో పాటు ఫైనాన్షియల్‌ నిఫ్టి భారీగా నష్టపోయాయి. బ్యాంక్‌ నిఫ్టి ఒకటిన్నర శాతంపైగా నష్టోయింది. దీంతో ఓపెనింగ్‌లోనే 16949 నుంచి 16855 పాయింట్లకు నిఫ్టి క్షీణించింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 127 పాయింట్ల నష్టంతో 16,876 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టిలో భారీగా క్షీణించిన షేర్లో ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలే ఉండటం విశేషం. మిడ్‌ క్యాప్‌ నిఫ్టి కూడా 0.85 శాతం క్షీణించింది. సరిగ్గా మార్కెట్‌ ప్రారంభానికి ముందే రాకేష్‌ఝునఝన్‌ వాలా మీడియాతో మాట్లాడుతూ…ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో వాటాపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ షేర్‌ 10 శాతం నష్టంతో ప్రారంభమైంది.