For Money

Business News

సిబిల్‌ బాగుంటే వడ్డీ 6.65 శాతమే

బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కొత్తగా పండగ ఆఫర్‌ను ప్రకటించింది. అధిక క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న కస్టమర్లకు 6.65 శాతం వడ్డీకే ఇంటి రుణం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందుకోసం సిబిల్‌ స్కోర్‌ కనీసం 800 ఉండాలన్న ఆంక్ష విధించింది. అలాగే 750 నుంచి 799 మధ్యన స్కోర్‌ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకుంటే కాస్తంత ఎక్కువ వడ్డీరేటుకు రుణం ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అర్హులైన కస్టమర్లు తమ హోమ్‌లోన్‌ రేటును ఆర్‌బీఐ రెపోరేటుతో అనుసంధానం చేసుకోవచ్చు. దీని వల్ల ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించినప్పుడల్లా ఇంటి రుణంపై వడ్డీ ఆటోమేటిగ్గా తగ్గుతుందని కంపెనీ పత్రికా ప్రకటనలో పేర్కొంది.