For Money

Business News

ఆ ఐఫోన్‌లో సిమ్‌ కార్డ్‌ స్లాట్‌ ఉండదు!

యాపిల్‌ మరో కొత్త ఫీచర్‌తో ఐఫోన్‌ 14ను తీసుకురానుంది. ఐఫోన్‌ 14ను సిమ్‌ కార్డు స్లాట్‌ లేకుండా రూపొందిస్తున్నట్లు టెక్‌ వెబ్‌సైట్‌ మ్యాక్‌ రూమర్స్‌ వెల్లడించింది. 2023కి సిమ్‌ కార్డు స్లాట్‌ లేని ఐఫోన్‌ 15 ప్రొ మోడళ్లను యాపిల్‌ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. 2022 సెప్టెంబరు కల్లా ఇ-సిమ్‌ మాత్రమే ఉండే స్మార్ట్‌ఫోన్‌లకు సిద్ధంగా ఉండాలని టెలికాం సంస్థలకు యాపిల్‌ సూచించినట్లు వెబ్‌సైట్‌ పేర్కొంది. రెండు ఇ-సిమ్‌ కార్డులు ఉండే ఫీచర్‌తో కొత్త మోడళ్లు రానున్నట్లు తెలుస్తోంది.