For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

కొత్త ఏడాది సంబరాలు ఊపందుకోవడంతో… మార్కెట్లు డల్‌గా ఉన్నాయి. నామమాత్రపు ట్రేడింగ్‌తో సాగుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు చాలా డల్‌గా ముగిశాయి. సూచీల్లో పెద్ద మార్పులు లేవు. డౌజోన్స్‌ ఒక్కటే 0.25 శాతం లాభంతో ముగిసింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. డల్‌గా ఉన్నాయి. నిక్కీవంటి సూచీలు నామమాత్రపు నష్టాలతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్‌ స్వల్ప లాభంతో ఉంది. కాని చైనా మార్కెట్లు ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ప్రధాన సూచీలు ఒక శాతం వరకు లాభంతో ఉన్నాయి. మన మార్కెట్ల విషయానికొస్తే సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. మన మార్కెట్లు కూడా అదే స్థాయిలో ప్రారంభం కావొచ్చు.