For Money

Business News

ఇక పేదల కోసం ప్రాథమిక వైద్య కేంద్రాలు

ఇన్నాళ్ళూ విద్యా రంగానికి విశేష సేవలు అందించిన అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ఇపుడు వైద్య రంగంలోనూ అదే తరహా సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కరోనా సమయంలో దేశంలో పలు కార్యక్రమాలను తమ ట్రెస్ట్‌ చేపట్టిందని…తాము మ‌రింత ముందుకు వెళ్లడానికి ఈ రంగం ఎంతో కీల‌క‌మైన‌దిగా భావిస్తున్నామని ట్రస్ట్‌ పేర్కొంది. ఈ మేరకు ట్రస్ట్‌ సీఈఓ అనురాగ్ బెహ‌ర్ ఒక ప్రక‌ట‌న‌ విడుదల చేశారు. ప‌లు చోట్ల ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు అలాంఇ ప్రాంతాల్లో మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ, మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేయ‌నున్నట్టు ఆయన వెల్లడించారు. ‘భార‌తేదేశవ్యాప్తంగా వైద్య సాయం అంద‌ని పేద‌లు చాలామంది ఉన్నారు. వాళ్లకు వైద్యం అందించడంపై ఇక దృష్టి పెడ‌తాం. ప్రజ‌లను మరింత ఆరోగ్యవంతుల్ని చేయ‌డ‌మే మా ప్రధాన ఉద్దేశం’ అని అనురాగ్ చెప్పాడు. ఫౌండేష‌న్ త‌ర‌ఫున ఆరోగ్యరంగానికి సంబంధించిన ప‌నుల‌ను ఆనంద్‌ స్వామినాథ‌న్ పర్యవేక్షిస్తారని ఆయన వెల్లడించారు. ఇపుడు చ‌దువు మీద ఎంత ఖ‌ర్చుపెడుతున్నామో వ‌చ్చే ఐదేళ్లలో అంతే మొత్తం ఆరోగ్యంపై కూడా ఖ‌ర్చు చేస్తామ‌ని అనురాగ్ బెహ‌ర్ వెల్లడించాడు. దాదాపు 20 ఏళ్ల నుంచి అజీమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్‌ నెలకొల్పిన యూనివర్సిటీ … ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో బోధనా సామర్థ్యం పెంచేందుకు టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.