For Money

Business News

బియ్యం, టీ దిగుమతిని ఆపిన ఇరాన్‌

దశాబ్దాల నుంచి మన దేశం నుంచి బాస్మతి బియ్యం, టీ పొడి దిగుమతిని ఇరాన్‌ .. ఆకస్మికంగా ఆపేసింది. దీనికి సంబంధించి రెండు దేశాల నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఎగుమతిదారులు గందరగోళంలో ఉన్నారు. హిజాబ్‌ వ్యతిరేక ఉద్యమం కారణంగా అనేక హోటల్స్‌ బంద్‌ ఉన్నాయని… దీంతో డిమాండ్‌ తగ్గిందని కొన్ని వర్గాలు అంటున్నారు… మన ఎగుమతిదారులు విశ్వసించడం లేదు. రూపీ ట్రేడ్‌ సెటిల్‌మెంట్ అగ్రిమెంట్‌ కోసం ఇరాన్‌, భారత్‌ చర్చలు జరుగుతున్నాయని మరో కథనం. ఏటా మన దేశం నుంచి 3 నుంచి 3.5 కోట్ల కిలో టీని ఇరాన్‌ దిగుమతి చేసుకుంటుంది. అలాగే 15 లక్షల కిలో బాస్మతి బియ్యం దిగుమతి చేసుకుంటుందని మన వ్యాపార సంస్థలు అంటున్నాయి. బియ్యం ఎగుమతులకు డిమాండ్‌ ఉండటం వల్ల పెద్ద ఇబ్బంది లేదు కాని… టీ దిగుమతులు ఆపడంతో మన వ్యాపారస్థులు కొద్దిగా కంగారు పడుతున్నారు. ఈ అంశాన్ని భారత టీ బోర్డు దృష్టికి తీసుకెళ్ళామని టీ వ్యాపార సంస్థలు అంటున్నాయి.