For Money

Business News

నిలకడగా అరబిందో షేర్‌

నిన్న భారీగా క్షీణించిన అరబిందో ఫార్మా షేర్‌ ఇవాళ నిలకడగా ఉంది. మార్కెట్‌ భారీ లాభాల్లో ఉన్నా… ఈ షేర్‌ మాత్రం స్వల్ప లాభంతో ట్రేడవుతోంది. ఉదయం రూ. 496.95కి చేరిన ఈ షేర్‌ మళ్ళీ క్షీణించి రూ. 487 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ షేర్‌ రూ. 9 లాభపడింది. కంపెనీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రా రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేయడంతో ఈ షేర్‌నిన్న భారీగా క్షీణించింది. కంపెనీ లావాదేవీలతో శరత్‌ చంద్రారెడ్డికి సంబంధం లేదని కంపెనీ అంటున్నా… హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ విషయంలో కంపెనీ అలా ఎలా అనగల్గుతుందని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల విషయంలో అలాంటి సమర్థింపు సబబుగా ఉన్నా… ప్రమోటర్‌ విషయంలో అలాంటి ప్రకటనను ఇన్వెస్టర్లు విశ్వసించడం లేదు. పైగా రాత్రి డాలర్‌ భారీగా క్షీణించిన నేపథ్యంలో ఇవాళ ఫార్మా షేర్ల కౌంటర్లలో పెద్దగా ఆసక్తి కన్పించడం లేదు. మరి ఈ షేర్‌కు మున్ముందు మార్కెట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.