For Money

Business News

స్టార్‌ షేర్లు HDFC ట్విన్స్‌

చైనాతో సహా అన్ని ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. యూరో మార్కెట్లలో ఇవాళ కూడా అప్‌ట్రెండ్‌ కొనసాగనుంది. రాత్రి బీభత్సంగా పెరిగిన అమెరికా ఫ్యూచర్స్‌ ఇవాళ కూడా అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. నిఫ్టి ప్రస్తుతం 304 పాయింట్ల లాభంతో 18334 వద్ద ట్రడేవుతోంది. సెన్సెక్స్‌ 1133 పాయింట్లు లాభపడింది. సూచీలు భారీ లాభాల్లో ఉన్నా… లాభాలు మాత్రం పరిమిత కౌంటర్లకే ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ అద్భుతంగా రాణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ 6.61 శాతం లాభంతో రూ. 2669 వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా రూ. 100 పెరిగి రూ. 1625 వద్ద ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్‌ 4 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.74 శాతం లాభంతో ఉన్నాయి. ఫలితాలు ప్రకటించిన జొమాటోలో కూడా లాభాల స్వీకరణ కన్పిస్తోంది. కాని షాక్‌ ఇచ్చిన షేర్‌ ఇండియా హోటల్స్‌. ఫలితాలు అద్భుతంగా ఉండటంతో ఓపెనింగ్‌లో ఈ షేర్‌ రూ.349ని తాకింది. లాభాల స్వీకరణ కారణంగా ఇపుడు ఆ షేర్‌ రూ. 312 వద్ద ట్రేడవుతోంది. అలాగే ఐషర్‌ మోటార్స్‌ కూడా 5 శాతం నష్టపోయింది.