For Money

Business News

తెలంగాణలో అటెరో భారీ పెట్టుబడి

తెలంగాణలో సుమారు రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ-వేస్ట్‌ రీసైక్లింగ్‌ సంస్థ అటెరో ఇండియా వెల్లడించింది. కొత్త యూనిట్‌ను ప్రారంభిస్తామని.. దీనివల్ల 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్గుతాయని పేర్కొంది. హైదరాబాద్‌లో ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో సమావేశం తరవాత కంపెనీ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. కంపెనీ నిర్ణయంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం ఎర్ర తివాచీ పరుస్తోందని అన్నారు. ఇటీవలే లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా కంపెనీలు జినోమ్‌ వ్యాలీలో రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపాయి.