For Money

Business News

నష్టాల్లో ఆసియా మార్కెట్లు

కరోనా కట్టడికి చైనా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పలు నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభత్వం జీరో కోవిడ్‌ విధానాలను వ్యతిరేకిస్తూ జనం వీధుల్లోకి వస్తున్నారు. దీని ప్రభావం మార్కెట్లపై పడుతోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నాస్‌డాక్‌ 0.52 శాతం నష్టం, డౌజోన్స్‌ 0.45 శాతం లాభంతో క్లోజైంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలో ఎలాంటి మార్పు లేదు. చైనాలో జరుగుతున్న మార్కెట్ల ప్రభావంతో అమెరికా డాలర్‌ స్వల్పంగా పెరిగింది. ఆ ఒక్కటి మినహా మిగిలిన మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా చైనా ఆందోళనల ఫలితంగా మెటల్స్‌ బాగా దెబ్బతినే అవకాశముంది. అలాగే క్రూడ్‌ ధరలు భారీగా తగ్గినందున కొన్ని మార్కెట్లకు పాజిటివ్‌గా కన్పిస్తున్నా… ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం విస్మరించరాదని హెచ్చరిస్తున్నారు. అమెరికా ఫ్యూచర్స్‌ అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. ఒక్క జపాన్‌ మాత్రమే 0.75 శాతం నష్టంతో ఉంది. మిగిలిన మార్కెట్లు ఒక శాతం నుంచి రెండు శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి. హాంగ్‌సెంగ్ ఏకంగా 3.66 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 83 పాయింట్ల నష్టంతో ఉంది. సో నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది.