For Money

Business News

షేర్‌ మార్కెట్‌లో ఉక్రెయిన్‌ యుద్ధ భయాలు

ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లక్షల సంఖ్యలో తన సైన్యాన్ని రష్యా ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించింది. ఇప్పటి ఫెడ్‌ నిర్ణయంపై తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న షేర్‌ మార్కెట్‌పై ఇపుడు ఉక్రెయిన్‌ యుద్ధం పెద్ద తలనొప్పిగా మారింది. ఫెడ్‌ రేపు, ఎల్లుండి సమావేశం కానుంది. వడ్డీ రేట్లపై ఫెడ్‌ నిర్ణయంపై మార్కెట్‌ టెన్షన్‌తో ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ పరిణామాలను మార్కెట్‌లో టెన్షన్‌ను మరింత పెంచింది. మరోవైపు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ లోని తన ఎంబసీ ఉద్యోగులను అమెరికా ఉపసంహరించింది. కీలక సిబ్బందిని ఉంచి.. సిబ్బంది కుటుంబ సభ్యులను వెనక్కి రప్పించింది. మరోవైపు ఉక్రెయిన్‌కు మద్దతుగా యూరప్‌లో నాటో దళాలకు మద్దతుగా వేల సంఖ్యలో తన సైన్యాన్ని పంపేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. ఈ మేరకు దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఆలోచన చేస్తున్నట్లు ద న్యూయార్క్‌ టైమ్స్‌ రాసింది. ఫెడ్‌ నిర్ణయాలను మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ చేసినందున… ఫెడ్‌ మీటింగ్‌ తరవాత మార్కెట్లు కోలుకుంటాయని భావిస్తున్నారు. తాజాగా ఉ్రకెయిన్‌ వ్యవహారం మార్కెట్లకు కొత్త తలనొప్పిగా మారుతోంది.