For Money

Business News

భారీ నష్టాలతో నిఫ్టి ప్రారంభం?

ప్రపంచ వ్యాప్తంగా షేర్‌ మార్కెట్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా నాస్‌డాక్‌ ఏకంగా 2.7 శాతం క్షీణించగా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.89 శాతం నష్టంతో ముగిసింది. డౌజోన్స్‌ కూడా 1.3 శాతం నష్టంతో క్లోజైంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. ఒక్క మార్కెట్‌ కూడా గ్రీన్‌లో లేదు. ముఖ్యంగా హాంగ్‌సెంగ్‌ ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఇక జపాన్‌ నిక్కీ కూడా అర శాతంపైగా నష్టంతో ఉంది. చైనా మార్కెట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. అమెరికాలో బాండ్‌ ఈల్డ్స్‌ స్వల్పంగా తగ్గాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉన్నాయి. దీంతో ఆసియా మార్కెట్ నష్టాలు తగ్గుతున్నాయి. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 150 పాయింట్ల నష్టంతో ఉంది. ఈ లెక్కన నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది. కాకపోతే ప్రారంభ సమయానికి తక్కువ నష్టంతో ప్రారంభమౌతుందేమో చూడాలి.