For Money

Business News

రూ.1ణ000కోట్లతో వైజాగ్‌ ప్లాంట్‌ విస్తరణ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రస్తుతం దావోస్‌ పర్యాలనలో బిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన ఆర్సెలార్‌ మిట్టల్‌ సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో భేటీ అయ్యారు. భేటీ తరవాత తమ వైజాగ్‌ ప్లాంట్‌ను మరింతగా విస్తరిస్తామని చెప్పారు. వైజాగ్‌లో నిప్పాన్‌ స్టీల్‌ ఇండియాకు పిల్లెట్‌ ప్లాంట్‌ ఉంది. దీని సామర్థ్యాన్ని 35 శాతం పెంచాలని నిర్ణయించామని, దీని కోసం మరో రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెడతామని అన్నారు. 2023 నుంచి ఈ ప్లాంట్ విస్తరణ పనులను మొదలు పెడతామని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈలోగా పర్యావరణ అనుమతులను తీసుకోవడానికి అవసరమైన ప్రక్రియను మొదలుపెడతామని పేర్కొన్నాయి. అంతకుముందు వైఎస్ జగన్‌తో ఆదిత్య మిట్టల్ భేటీ.. దావోస్‌లో పర్యటిస్తోన్న వైఎస్ జగన్‌తో ఆర్సెలార్ మిట్టల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్య మిట్టల్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అంశాలు వారిద్దరి మధ్య ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. భవిష్యత్తులో విశాఖపట్నాన్ని పారిశ్రామిక హబ్‌గా, ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నామని, దీనికోసం ఇదివరకే చర్యలు చేపట్టామని వైఎస్ జగన్ వివరించారు.