For Money

Business News

చక్కెర షేర్లలో కొనసాగిన పతనం

కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత తొలిసారి చక్కెర షేర్లు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చినపుడు కిలో చక్కెర బహిరంగ మార్కెట్‌లో క్వాలిటీని బట్టి రూ. 20 నుంచి రూ.25 మధ్య ఉండేది.ఇపుడు దాదాపు రెట్టింపు అయింది. ముఖ్యంగా పెట్రోల్‌లో ఎథనాల్‌ బ్లెండింగ్‌ శాతం పెంచడంతో పాటు ఎగుమతులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే. కాని ఈసారి ప్రపంచ వ్యాప్తంగా చక్కెర డిమాండ్‌ పెరగనుంది. బ్రెజిల్‌లో పంట దెబ్బతిన్నందున చక్కెర డిమాండ్ పెరుగుతోంది. ఆమాటకొస్తే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది.దీంతో నిన్న స్టాక్‌ మార్కెట్‌లో చక్కెర కంపెనీల షేర్ల ధరలు భారీగా క్షీణించాయి. శ్రీ రేణుకా సుగర్స్‌ షేర్‌ ఏకంగా 14 శాతం క్షీణించింది. బలరామ్‌ పూర్‌ చిన 6 శాతం, బజాజ్‌ హిందుస్థాన్‌, మావన్నా సుగర్స్‌, ఉగర్‌ సుగర్‌ అయిదు శాతం క్షీణించాయి. ఇక బలరామ్‌పూర్‌ చిని షేర్‌ పది శాతం క్షీణించింది. ఉత్తమ్‌ సుగర్‌, ద్వారికేష్‌ సుగర్‌ కూడా 5 శాతం చొప్పున తగ్గాయి. ఇవాళ కూడా చక్కెర కౌంటర్లలో భారీ ఒత్తిడి కన్పిస్తోంది. బలరామ్‌ పూర్‌ చిన ఇవాళ కూడా 6 శాతంపైగా క్షీణించి రూ. 366కు చేరింది. శ్రీ రేణుకా సుగర్స్‌ 4 శాతం తగ్గింది. దాదాపు అన్ని చక్కెర షేర్లు ఇవాళ కూడా నష్టాల్లో ఉన్నాయి.