For Money

Business News

3 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌

యాపిల్‌ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 3 ట్రిలియన్‌ డాలర్ల (3 లక్షల కోట్ల డాలర్లు)ను రాత్రి తాకింది. కొద్దిసేపు మాత్రమే ఈ స్థాయిలో నిలబడింది. రాత్రి అమెరికా మార్కెట్‌లో షేర్‌ 182.01 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో మార్కెట్‌ క్యాప్‌ 2.99 ట్రిలియన్‌ డాలర్లుగా నిలిచింది. కార్పొరేట్‌ ప్రపంచంలో ఈ రికార్డు సాధించిన తొలి కంపెనీగా యాపిల్ చరిత్ర సృష్టించింది. 1976లో ఓ కంప్యూటర్‌ కంపెనీగా మొదలైన యాపిల్‌ కంపెనీ వైభవం ఐఫోన్‌తో మొదలైంది. స్టీవ్‌ జాబ్స్‌ 2007లో తొలి యాపిల్‌ ఐఫోన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి కంపెనీ వృద్ధి రేటు అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది.