For Money

Business News

17,700పైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది.17681 వద్ద ప్రారంభమైన నిఫ్టి 17,647ని పడినా వెంటనే కోలుకుని 17,707ని తాకింది. సూచీలన్నీ ఒక మోస్తరు లాభాలకే పరిమితమయ్యాయి. నిఫ్టి ఇపుడు 35 పాయింట్ల లాభంతో 17660 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 41 షేర్లు లాభాల్లో ఉన్నా…నిఫ్టి కేవలం 0.2 శాతం మాత్రమే లాభపడింది. ఎంపిక చేసిన షేర్లలోనే ట్రేడింగ్‌ సాగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా హాలీడే మూడ్‌లో ఉన్నారు. ఇక మార్కెట్‌ ట్రెండ్‌కు సంబంధించి… రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు ఈ స్థాయిలోనూ తమ పొజిషన్స్‌ను కొనసాగింవచ్చు. డే ట్రేడర్స్ మాత్రం ఆల్గో లెవల్స్‌కు పరిమితం కావడం మంచిది. క్రూడ్‌ ఆయిల్‌ భారీ లాభాల కారణంగా ఓఎన్‌జీసీ టాప్‌ గెయినర్‌గా ఉంది. నిఫ్టి ఓవర్‌బాట్‌ పొజిషన్‌లో ఉంది, విదేశీ ఇన్వెస్టర్లు నిఫ్టి కాల్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్ట్‌లను అమ్ముతున్నారు. అధిక స్థాయిలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండటం మంచిది.