For Money

Business News

NIFTY TODAY: 17,700 దాటేనా?

చాలా రోజుల తరవాత విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. పెట్టుబడి తక్కువైనా… సెంటిమెంట్‌ మారింది. మరి ఈ ట్రెండ్ ఇవాళ కూడా కొనసాగుతుందా అనేది చూడాలి. ఎందుకంటే డాలర్‌ పెరగడం, క్రూడ్‌ కొత్త రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో నిఫ్టి అధిక స్థాయిల వద్ద నిలదొక్కుకుంటుందా అన్నది చూడాలి. వాణిజ్య లోటు భారీగా పెరగడం కూడా ఆందోళన కల్గించే అంశమే. అయితే రీటైల్‌ ఇన్వెస్టర్లు వీటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. సో.. నిఫ్టి లెవల్స్‌ చూసి ట్రేడ్‌ చేయడం వినా మరో మార్గం లేదు. నిఫ్టి క్రితం ముగింపు 17652. సింగపూర్‌ నిఫ్టి స్థిరంగా ఉంది. నిఫ్టి ఇదే స్థాయిలో ప్రారంభమైతే…నిఫ్టి 17700ని దాటుతుందేమో చూడండి. ఎందుకంటే ఐటీ షేర్లకు మద్దతు లభించే పక్షంలో నిఫ్టి ఈ స్థాయికి రావొచ్చు. పై స్థాయిలో నిఫ్టి లెవల్స్‌ చూస్తే తొలి ప్రతిఘటన 17725, రెండో ప్రతిఘటన 17750.17800 దాటితే ఏకంగా 17950 వరకు ఎలాంటి ప్రతిఘటన లేదు. ఇక పడితే నిఫ్టికి తొలి మద్దతు 17540. తరవాతి స్థాయి 17495. నిఫ్టి ఓవర్‌బాట్‌ స్థితిలో ఉంది. సో…నిఫ్టి కొనుగోలు చేయడం కన్నా… పై స్థాయిలో అమ్మే అవకాశాలు గమనించండి. లాంగ్‌టర్మ్‌ పొజిషన్స్‌ ఉన్నవారు తమ పొజిషన్స్‌ను కొనసాగించవచ్చు.