For Money

Business News

ప్రత్యేక హోదాపై కేంద్రం డొంక తిరుగుడు సమాధానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా? విభజనం చట్టంలో పేర్కొన్నట్లు ఏపీకి ఎప్పటిలోగా ప్రత్యేక హోదా ఇస్తారని టీడీపీ ఎంపీ కె రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అందులో ప్రత్యేక హోదా అంశంపై సమాధానాన్ని దాటేశారు. ఆ ప్రశ్నకు సమాధానంగా 14, 15వ ఆర్థిక సంఘాల సిఫారసుల గురించి ప్రస్తావించి.. సమాధానం ముగించారు. ప్రత్యేక హోదా ఇస్తామని కాని, ఇవ్వమని కాని నేరుగా… స్పష్టం చేయలేదు.
పన్నుల్లో వాటా కేటాయించే విషయంలో 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు, సాధారణ హోదా మధ్య ఎలాంటి తేడా చూపలేదని నిత్యానంద్‌ రాయ్‌ అన్నారు.2015-20 మధ్య కాలానికి ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు కేటాయించే మొత్తాన్ని 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని పేర్కొంది.15వ ఆర్థిక సంఘం కూడా అదే ఫార్ములాను ఆమోదించిందని అన్నారు. అయితే జమ్మూ, కాశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినందున ఒక శాతం తగ్గించి 41 శాతం వాటా ఇచ్చినట్లు నిత్యానంద్‌ రాయ్‌ అన్నారు. పన్ను ఆదాయాన్ని సాధ్యమైనంత ఎక్కువ కేటాయించి వనరుల లోటు తీర్చే ప్రయత్నం చేశామని అన్నారు. ఇంకా లోటు ఉంటే వాటికి ప్రత్యేకంగా రెవెన్యూ లోటు గ్రాంట్లు కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఇక విభజన చట్టంలోని మిగతా అంశాల గురించి సమాధానం ఇస్తూ.. చాలా వరకు హామీలను నెరవేర్చామని అన్నారు. మౌలిక సుదపాయాలు, విద్యా సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలు పూర్తి చేయడానికి దీర్ఘకాలం పడుతుందని… నిర్ణీత పదేళ్ళలో పూర్తి చేస్తామని అన్నారు. విభజన చట్టంలోని మిగిలిన అంశాలను పూర్తి చేసేందుకు హోం శాఖ 28 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.