For Money

Business News

సినిమా టికెట్ల ధరల జీవో జారీ

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. టికెట్ల ధరల కోసం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ/గ్రామ పంచాయతీలుగా విభజించారు. అలాగే నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ మల్టీ ఫ్లెక్సీల వారీగా టికెట్ల ధరలు నిర్ణయించారు. దీనికి తోడు
ప్రతి థియేటర్లలో ప్రీమియం, నాన్ ప్రీమియంగా విభజించారు. ఏసీ థియేటర్లలో రీక్లయినర్‌ సౌకర్యం ఉన్నట్లయితే టికెట్‌ రూ. 250గా నిర్ణయించారు.ఈ టికెట్ల ధరలకు జీఎస్టీ అదనం. ఈ ధరల్లో ఏసీ థియేటర్లకైతే రూ.5, సాధారణ థియేటర్లకైతే రూ.3 మెయింటెనెన్స్‌ చార్జి కలిసి ఉంటుంది. అలాగే సర్వీస్‌ చార్జీలతో పాటు ఆన్‌లైన్‌ బుకింగ్ చార్జిలు కూడా కలిపి ఉంటాయి. అంటే జీఎస్టీ తప్ప మిగిలిన అన్ని రకాల ఖర్చులు ఈ టికెట్‌ ధరల్లో ఉంటాయి. కొత్త జీవో ప్రకారం అతి తక్కువ ధర రూ. 20లు నగర లేదా గ్రామ పంచాయితీ (నాన్ ప్రీమియర్‌)లో ఉంటుంది. నాన్‌ ఏసీ, నాన్‌ ప్రీమియర్‌ థియేటర్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అయితే రూ. 40, మున్సిపాలిటీ అయితే రూ. 30 వసూలు చేయాలి. ఇవే తక్కువ ధరలు.థియేటర్‌ ఎక్కడుందనే దానితో నిమిత్తం లేకుండా ఏసీ, నాన్‌ ఏసీ, స్పెషల్‌ థియేటర్‌ అయినా సరే… 25 శాతం సీట్లు నాన్‌ ప్రీమియ కేటగిరి కింద ఉంచాలి.
మిగిలిన ధరలు దిగువ పట్టికలో….