For Money

Business News

వాల్‌స్ట్రీట్‌లో కొనసాగుతున్న పతనం

రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను కొనుగోలు చేయరాదన్న అమెరికా ప్రతిపాదనకు ఆయిల్‌ మార్కెట్‌ చాలా ఫాస్ట్‌గా స్పందించింది. ఒక్కసారిగా 140 డాలర్లను తాకి మళ్ళీ 125 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది. రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతిని ఆపే ప్రసక్తి లేదని జర్మనీ ప్రకటించడంతో ఆ దేశ మార్కెట్లు శాంతించాయి. మధ్యాహ్నం 4 శాతం నష్టాలతో ఉన్న జర్మనీ డాక్స్‌ ఇపుడు రెండు శాతం నష్టంతో ఉంది. యూరో మార్కెట్లన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌ ఇవాళ కూడా అరశాతంపైగా పెరగడం కూడా మరో కారణం. దీంతో అమెరికా మార్కెట్లలో పతనం కొనసాగుతోంది. డౌజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీతో పాటు నాస్‌డాక్‌ కూడా 1.8 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ 99.25కి చేరింది. ఆయిల్‌, మెటల్‌ మార్కెట్‌లో సంక్షోభం కారణంగా పారిశ్రామిక ఉత్పత్తిపై పడనుంది. దీంతో వెండి నష్టాల్లో ఉంది. బంగారం గ్రీన్‌లో ఉన్నా 2000 డాలర్ల లోపే ఉంది.