For Money

Business News

రెవెన్యూ లోటు భర్తీకి రూ.879 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 202-23లో దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కింద తొలి విడతగా రూ.7,183 కోట్లు విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా రూ. 1132 కోట్లు పశ్చిమ బెంగాల్‌కు కేటాయించగా రూ. 1097 కోట్లు కేరళకు కేటాయించారు. తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.879 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. 22-23 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అత్యధికంగా ఏడాదికి రూ. 13587 కోట్లు పశ్చిమ బెంగాల్‌కు రూ. 13174 కోట్లు కేరళకు, రూ. 10549 కోట్లు ఏపీకి కేటాయించాల్సి ఉంది. పూర్తి ఏడాదికి రూ.86,201 కోట్లు కేటాయించాల్సి ఉండగా, ఏప్రిల్‌నెలలో తొలి విడతగా రూ. 7183 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.