For Money

Business News

చార్జీలు పెంచిన తెలంగాణ ఆర్టీసీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మళ్ళీ చార్జీలను పెంచింది. డీజిల్‌ సెస్‌ పేరుతో ఈ అదనంగా భారం వేస్తున్నారు. ఇక నుంచి బస్సు సర్వీసుల్లో కనీస ధర రూ.10గా నిర్ణయించారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రూ. 2 చొప్పున చార్జీలు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, మెట్రో డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసులకు రూ. 5 చొప్పున పెంచారు. పెంచిన చార్జీలు రేపటి నుంచే అమలు చేస్తున్నారు. ఇటీవల కేంద్రం ప్రభుత్వం వరుసగా డీజిల్‌ ధరలను పెంచడంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం రెండు వారాల్లో డీజిల్‌ ధరను లీటరుకు రూ.10పైగా కేంద్రం పెంచింది.