For Money

Business News

డేటా సెంటర్ల విస్తరణపై రూ. 5000 కోట్లు

తమ డేటా సెంటర్‌ వ్యాపారాన్ని భారీ ఎత్తున విస్తరించాలని భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది. తన అనుబంధ కంపెనీ Nxtra ద్వారా 2025 కల్లా ఈ పెట్టుబడి పెడతామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాన మెట్రో నగరాల్లో కొత్త డేటా సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఎయిర్‌టెల్‌ స్థాపక సామర్థ్యం 400 మెగావాట్లకు పెంచుతామని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో డేటా సెంటర్స్‌లో అతి పెద్ద నెట్‌వర్క్‌ ఉన్న కంపెనీ Nxtraనే. దాదాపు పది పెద్ద, 120 ఎడ్జ్‌ డేటా సెంటర్లను ఈ కంపెనీ నిర్వహిస్తోంది.