For Money

Business News

ప్రభుత్వానికి రూ. 2,700 కోట్ల నగదు

నిజమే. ఎయిర్‌ ఇండియా సంస్థ అమ్మకం వల్ల ప్రభుత్వానికి వచ్చేది రూ. 2700 కోట్ల నగదు మాత్రం. రూ. 18,000 కోట్లకు అమ్మినా.. రూ. 15,300 కోట్లను రుణదాతలకు టాటా గ్రూప్‌ చెల్లిస్తుంది. ప్రభుత్వానికి రూ. 2700 కోట్ల క్యాష్‌ ఇస్తుంది.దీనికి గాను ఎయిర్‌ ఇండియాలో వంద శాతం వాటాతో పాటు గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ కంపెనీ ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌లో 50 శాతం వాటా కూడా వస్తుంది. ఇవి మాత్రమే ప్రభుత్వం బయటికి చెప్పేవి. కాని ఎయిర్‌ ఇండియాతో టాటా గ్రూప్‌కు వచ్చే ఇతర ఆస్తులు ఇవి…
ఎయిర్‌ ఇండియాకు మన దేశంలో 4,400 దేశీయ, 1800 అంతర్జాతీయ ల్యాండింగ్‌, పార్క్‌ స్లాట్లు వస్తాయి.ఇక 42 దేశాల్లో2738 పార్కింగ్‌ స్లాట్లు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రాలలో స్లాట్లు దొరకడం చాలా కష్టం. అలాంటి లండన్‌లోని హెథ్రో, న్యూయార్క్‌ జేఎఫ్‌కే, సింగపూర్ చాంగి, హాంగ్‌కాంగ్‌లలో ఎయిర్‌ ఇండియాకు పార్కింగ్‌ స్లాట్లు ఉన్నాయి.

ఎయిర్‌ ఇండియాకు ఇపుడు 144 విమానాలు ఉన్నాయి. ఇండిగో తరవాత అతి పెద్ద విమానయాన కంపెనీ ఎయిర్‌ ఇండియా అవుతుంది.
జెట్‌ ఎయిర్‌వేస్‌ మూసివేసినపుడు రూట్ల కోసం ఎక్కడలేని డిమాండ్‌ వచ్చింది. నిజమే కీలక రూట్లు అంత ఈజీగా లభించవు. ముఖ్యంగా గల్ఫ్‌, సింగపూర్, హాంగ్‌కాంగ్, లండన్‌, ఢాకా, ఖాట్మాండు వంటి రూట్లు ఎయిర్‌ ఇండియాకు ఉంటాయి. ఇవి ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందంతో వచ్చి రూట్లు. వాటిని రద్దు చేయరు. అంటే ఆయాచితంగా ఈ రూట్లన్నీ టాటాలకు వచ్చాయన్నమాట. ఇంకా సీఐఎస్‌, రష్యా, బంగ్లాదేశ్‌, హాంగ్‌కాంగ్‌ దేశాలతో ద్వైపాక్షి ఒప్పందం కింద వచ్చిన రూట్ల ఉన్నాయి. ఎయిర్‌ ఇండియాకు వారానికి 651 రూట్లు ఉన్నాయి. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలకు. అంటే ఆర్టీసీ బస్సులను కాదు రూట్లను కూడా అమ్మినట్లన్నమాట.
భారీ సంఖ్యలో శిక్షణ పొందిన పైలెట్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవం ఉన్న పైలెట్లు దొకడం కష్టం. కాని ఎయిర్‌ ఇండియా మంచి సిబ్బంది ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. రూట్లు లేకుండా బస్సులు కొని ఏం లాభం? కొన్నా.. తరవాత ప్రభుత్వం నుంచి వాటిని తీసుకోవడం అంత ఈజీ కాదు. దేశీయ ఆపరేషన్స్‌ నడుపుతున్న కంపెనీలు విదేశీ రూట్ల కోసం ఎన్ని అగచాట్లు పడాలో ప్రైవేట్‌ కంపెనీలు రుచి చూశాయి. అందులో కీలక రూట్లలో చాలా పోటీ ఉంటుంది. అవన్నీ చాలా ఈజీగా టాటాలకు వచ్చేశాయి.