టీసీఎస్ పనితీరు ఓకే

సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో టీసీఎస్ కంపెనీ రూ. 46,867 కోట్ల అమ్మకాలపై రూ. 9,624 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. సీఎన్‌బీసీ టీవీ18 తమ అంచనాలకు కాస్త తక్కువగా ఉన్నాయని పేర్కొంది. కంపెనీ మార్జిన్ కూడా 26.1 శాతం నుంచి 25.6 శాతానికి తగ్గిందని తెలిపింది. డాలర్ కరెన్సీ విలువలో హెచ్చతగ్గులు, పెరిగిన వ్యయం దృష్ట్యా కంపెనీ మంచి పనితీరు కనబర్చిందని విశ్లేషకులు అంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈపీఎస్ 15.7 శాతం పెరిగిందని టీసీఎస్ పేర్కొంది.