For Money

Business News

FY 22లో 78,000 ఫ్రెషర్స్‌ను తీసుకుంటాం

కంపెనీ నుంచి వెళ్ళిపోతున్న సంఖ్య పెరుగుతుండటంతో టీసీఎస్‌ ఫ్రెషర్స్‌ రిక్రూట్‌మెంట్‌ను పెంచింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 78,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటామని కంపెనీ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే 43,000 మందిని తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. గత మూడు నెలల్లోనే 19,690 మందిని రిక్రూట్‌ చేసుకున్నారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 40,000 మందిని తీసుకుంటామని పేర్కొంది. అయితే గత త్రైమాసికంలో 8.6 శాతం మంది ఉద్యోగం మారడంతో… ఫ్రెషర్స్‌ను సంఖ్యను బాగా పెంచామని పేర్కొంది. రానున్న ఆరునెలల్లో మరో 35,000 మందిని తీసుకుంటాని స్పష్టం చేసింది. మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉన్నందున ఉద్యోగం మారుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.