For Money

Business News

మెటల్స్‌లోని అదానీ

కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్లు అదానీ గ్రూప్‌ అందిన ప్రతి వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. తాజాగా అల్యూమినియం వ్యాపారంలోకి అదానీ గ్రూప్‌ ప్రవేశిస్తోంది. ఈ మేరకు ఒడిశాలో 520 బిలియన్‌ డాలర్ల అంటే దాదాపు రూ.41,080 కోట్లతో అల్యూమినా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కార్యాలయం ట్విటర్‌లో వెల్లడించింది. ఈ మేరకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. ఒడిశా ప్రాజెక్టుపై స్పందించడానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధి నిరాకరించారు. అయితే, ముంద్రా అల్యూమినియం లిమిటెడ్‌ పేరిట గత డిసెంబరులోనే అదానీ గ్రూప్‌ ఓ అనుబంధ సంస్థను నెలకొల్పింది. ప్రస్తుతం ఈ రంగంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌, వేదాంత రిసోర్సెస్‌ లిమిటెడ్‌ ఆధిపత్యం కొనసాగుతోంది.