For Money

Business News

అటల్ పెన్షన్‌ యోజనకు వారు అనర్హులు..!

కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకమైన అటల్ పెన్షన్‌ యోజన (ఏపీవై)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కట్టేవాళ్ళు ఈ స్కీమ్‌కు అనర్హులని ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అక్టోబరు 1, 2022వ తేదీ నుంచి ఇన్‌కమ్‌ ట్యాక్స్ కట్టేవారుఉ అటల్ పెన్షన్‌ యోజనలో చేరేందుకు అనర్హులు. అయితే ఆ తేదీ కంటే ముందే స్కీంలో చేరిన వారికి ఈ నిబంధన వర్తించదని పేర్కొంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కడుతూ.. ఈ స్కీమ్‌లోకి అక్టోబరు 1 తర్వాత చేరినట్లు గుర్తిస్తే వారి ఖాతాను మూసివేస్తామని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టాల నిబంధనల ప్రకారం.. ఏడాదికి రూ.2.5లక్షల కంటే ఎక్కువ వేతనం ఉన్నవారు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.