For Money

Business News

లాభాలను నిలబెట్టుకున్న నిఫ్టి

ఉదయం నుంచి ఆకర్షనీయ లాభాలతో ట్రేడైన నిఫ్టి చాలా వరకు లాభాలను నిలబెట్టుకుంది. ఉదయం 17719 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి .. అదే జోరును మిడ్‌ సెషన్‌ దాకా కొనసాగించింది. యూరో మార్కెట్లు డల్‌గా ప్రారంభం కావడంతో స్వల్ప లాభాల స్వీకరణ వచ్చింది. కాని నిఫ్టి పడినపుడల్లా మద్దతు అందడంతో చివర్లో 17659 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 124 పాయింట్లు లాభపడింది. యూరో మొత్తానికి గ్రీన్‌లో ఉండటం, అమెరికా ఫ్యూచర్స్‌ కూడా ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపలేదు. దీంతో వీక్లీ డెరివేటివ్స్‌ కూడా పెద్ద మార్పు లేకుండానే ముగిశాయి. ఇవాళ దాదాపు అన్ని ప్రధాన సూచీలు ఒకేస్థాయి లాభాలు ఆర్జించిగా.. నిఫ్టి బ్యాంక్‌ సూచీ అద్భుతంగా 1.5 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టిలో గెయినర్స్‌లో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలే టాప్‌లో ఉండటం విశేషం. యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌లో ఉన్నాయి. ఫలితాలు నిరాశ కల్గించడంతో టాటా కన్జూమర్‌లో ఒత్తిడి వచ్చింది. అలాగే అపోలో హాస్పిటల్‌ కూడా ఇవాళ రెండు శాతంపైగా నష్టపోయింది. ఇతర షేర్లలో జైడస్‌ లైఫ్‌, నౌకరి, ముత్తూట్‌ ఫైనాన్స్‌, హెచ్‌ఏఎల్‌, భారత్‌ ఫోర్జింగ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఎస్‌బీఐ చక్కటి లాభాలతో ముగిశాయి. ఇక నష్టపోయిన ఇతర షేర్లలో ఐసీఐసీఐ ప్రూడెన్షియల్‌, గెయిల్‌, ఎంఆర్‌ఎఫ్‌, జీ ఎంటర్‌టైన్మెంట్‌, బంధన్‌ బ్యాంక్‌ ఉన్నాయి.