For Money

Business News

టెలికాం రంగంలోకి అదానీ గ్రూప్‌

ఇప్పటి వరకు కీలక రంగాల్లో ప్రవేశించిన అదానీ గ్రూప్‌ ఇపుడు టెలికాం రంగంలో కూడా ప్రవేశించేందుకు రెడీ అయింది. టెలికాం స్పెక్ట్రమ్‌ కోసం ఈ గ్రూప్‌ దరఖాస్తు చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (NLD) ఇంటర్నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (ILD) లైసెన్స్‌లను కేంద్ర ప్రభుత్వం నుంచి అదానీ గ్రూప్‌ ఇప్పటికే తీసుకుంది. తాజాగా ఎయిర్‌వేస్‌ కోసం అదానీ గ్రూప్‌ దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 26వ తేదీన స్పెక్ట్రమ్‌ కోసం కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహించనుంది. ఈ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్‌ కూడా దరఖాస్తు కొనుగోలు చేసిందని, వేలంలో పాల్గొంటుందని మీడియా వర్గాల్లో కథనాలు వస్తున్నాయి.