For Money

Business News

రెండున్నరేళ్ళలో రూ.2400 కోట్ల టర్నోవర్‌?

రాష్ట్రంలో తమ బినామీ కంపెనీల ద్వారా మద్యం వ్యాపారం చేసి ప్రజలను దోచుకుంటున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ ప్రభుత్వం అమ్ముతున్నది విషపు మద్యమేనని ఆరోపిస్తూ…తమ బినామీ కంపెనీల ద్వారా వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఒకే అ్రడస్‌తో 19 కంపెనీలను ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడు పెన్నక రోహిత్‌ ఏర్పాటు చేశాడని ఆయన ఆరోపించారు. ఇందులో మూడు కంపెనీలో రోహిత్‌ రెడ్డి ఇప్పటికీ డైరెక్టర్‌గా ఉన్నారని అన్నారు. ఈ కంపెనీల్లో అరబిందో లేక్‌వ్యూ డెవలపర్స్‌, టెనెట్‌ బయోలాజికిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు శ్రేయాస్‌ బయోలాజికల్‌లో డైరెక్టర్‌గా ఉన్నారని ఆనం వెంకట రమణా రెడ్డి ఆరోపించారు. అయితే ఇదే కంపెనీల్లో శ్రీనివాస్‌ కాసిఛయానుల కూడా డైరెక్టర్‌గా ఉన్నాడని ఆయన వెల్లడించారు. ఆ శ్రీనివాస్‌ ప్రస్తుతం వార్తల్లో ఉన్న అదాన్‌ డిస్టలరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్‌ అని వెల్లడించారు. ఏపీ మద్యం సరఫరా చేస్తున్న ప్రధాన కంపెనీల్లో అదాన్‌ డిస్టలరీస్‌ ఒకటి. ఈ కంపెనీకి డిస్టలరీ లేకున్నా మరో కంపెనీతో ఒప్పందం చేసుకుని ఏపీకి మద్యం సరఫరా చేస్తోందిన ఆనం వెంకట నారాయణ రెడ్డి వెల్లడించారు. 2019 డిసెంబర్‌ 2న ఏర్పాటైన అదానీ డిస్టలరీస్‌ రెండున్నర ఏళ్ళలోనే రూ. 2400 కోట్ల టర్నోవర్‌ సాధించిందని ఆయన చెప్పారు. జగన్మోహన్‌ రెడ్డి, విజయసాయి రెడ్డిల బినామీ కంపెనీనే అదాన్‌ డిస్టిలరీస్‌ అని ఆయన ఆరోపించారు. అరబిందో కంపెనీ ప్రమోటర్లతో ఇంత సన్నిహితంగా ఉన్న శ్రీనివాస్‌తో పాటు బొల్లరామ్‌ శివకుమార్‌ అనే వ్యక్తి కూడా అదాన్‌ డిస్టలరీస్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. చిత్రమేమిటంటే… శివకుమార్‌ వైట్‌ డీర్‌ స్పిరిట్స్‌ అండ్‌ డిస్టిలరీస్‌ ఎల్‌ఎల్‌పీ లో డైరెక్టర్‌గా ఉండటం విశేషం. అంటే బినామీ డైరెక్టర్లతో పలు డిస్టలరీస్‌ ఒక ముఠాగా పనిచేస్తున్నాయన్నమాట. వైట్‌డీర్‌ స్పిరిట్స్‌లో బెహరూన్‌ సాజిల్‌ షేక్‌ అనే వ్యక్తి మరో డైరెక్టర్‌గా ఉన్నారు.