For Money

Business News

మస్క్‌పై దావా వేస్తాం.. ట్విటర్‌

4400 కోట్ల డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు మస్క్‌ ప్రకటించడంతో ట్విటర్‌ కోర్టును ఆశ్రయించే అవకాశముంది. డీల్‌ను పూర్తిచేసేందుకు టెస్లా సీఈవోపై కోర్టులో కేసు వేస్తామని పేర్కొంది. వాస్తవానికి డీల్‌ను బ్రేక్‌అప్‌ చేసుకున్నందుకు మస్క్‌ నుంచి 100డాలర్లను ఫీజును ట్విట్టర్‌ వసూలు చేసుకునే అవకాశం ఉందని, అయినా కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేయించడానికి ట్విట్టర్‌ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నకిలీ ఖాతాల సంఖ్య తగిన సమాచారం ట్విట్టర్‌ ఇవ్వడం లేదని.. అందుకే ఈ డీల్‌ రద్దు చేసుకుంటున్నట్లు మస్క్‌ వెల్లడించారు. నకిలీ/స్పామ్‌ ఖాతాల సంఖ్యను బేరిజు వేసుకునేందుకు సమాచారాన్ని కోరుతూ తన క్లయింట్‌ రెండు నెలలు వేచిచూశారని, కంపెనీ ఈ సమాచారం ఇవ్వలేదంటూ మస్క్‌ లాయర్‌ ట్విట్టర్‌ బోర్డ్‌కు లేఖ రాశారు.