28 శాతం ఉద్యోగులు వెళ్ళిపోయారు
ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్న ఉద్యోగుల శాతం 27.7 శాతానికి చేరింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో 22,000 మంది కంపెనీ వొదిలి వెళ్ళిపోయారు. గత ఏడాది మార్చితో ముగిసిన ఏడాదిలో కంపెనీ వొదిలి వెళ్ళిన ఉద్యోగుల శాతం 10.9 శాతమే. అంటే ఏడాదిలో 16.8 శాతం మంది ఉద్యోగులు అదనంగా కంపెనీ వీడుతున్నారన్నమాట. మార్చితో ముగిసిన మూడు నెలల్లో కొత్తగా 21,948 మందిని తీసుకున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. మార్చినాటికి ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 3,14,016 అని కంపెనీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 85,000 మందిని కొత్తగా ఉద్యోగంలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఉద్యోగుల్లో మహిళల శాతం 39.6 శాతమని ఇన్ఫోసిస్ పేర్కొంది.