లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు గత శుక్రవారం గ్రీన్‌లో ముగియండంతో … ఇవాళ మన మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కావొచ్చు. శుక్రవారం నాస్‌డాక్ ఏకంగా ఒక శాతంపైగా లాభంతో ముగిసింది. ఇతర సూచీలూ గ్రీన్‌లో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా స్థిరంగా ఉన్నాయి. చైనా, హాంగ్‌సెంగ్ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. రెడ్‌లో ఉన్నా పెద్ద నష్టాల్లేవ్. ఇతర మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి… జపాన్‌తో పాటు కీలక మార్కెట్లు దాదాపు అర శాతం లాభంతో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి 80 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కానుంది.