For Money

Business News

NIFTY TODAY: సెల్‌ సిగ్నల్‌

నిఫ్టి ఇవాళ కూడా లాభాలతో ప్రారంభం కానుంది. ఆసియా మార్కెట్లు జాగ్రత్తగా ట్రేడవుతున్నా.. మన మార్కెట్లు అమెరికా మార్కెట్లను ఫాలో అవుతోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు ముఖ్యంగా నాస్‌డాక్‌ లాభాలను పరిశీలిస్తోంది. డాలర్‌ బలం ఐటీషేర్లకు కలిసి వస్తోంది. నిఫ్టి క్రితం ముగింపు 18,102. ఇవాళ్టి ట్రేడింగ్‌కు నిఫ్టి 18,200 దాటుతుందా అనేది చూడాలి. ఎందుకంటే తొలి ప్రతిఘటన అక్కడే ఎదురు కానుంది. తరువాతి ప్రతిఘటన 18,220. 18,260 దాటితే నిఫ్టి భారీ ర్యాలీకి సిద్ధమైనట్లే. నిఫ్టి గరిష్ఠ లెల్స్‌ గమనించండి. మీ రిస్క్‌ను బట్టి ఎక్కడ షార్ట్‌ చేస్తారో నిర్ణయించండి. తొలుత నిఫ్టి18,200 దాటితే వెంటనే అమ్మొచ్చు. స్టాప్‌లాస్‌ మాత్రం 18220. ఈ స్థాయి దాటితే నిఫ్టిని అమ్మొద్దు. ఇక నిఫ్టి ఓపెనింగ్‌ నుంచి పడితే 18,100కు వస్తుందేమో చూడండి. ఈ స్థాయికి దిగువకు చేరితే 18,050, 18,030ని తాకొచ్చు. నిఫ్టికి 18,015 స్థాయిలో మద్దతు అందొచ్చు. మద్దతు స్థాయికి మార్కెట్‌ పడుతుందా అనేది చూడాలి. చాలా రోజుల తరవాత నిఫ్టి సెల్‌ సిగ్నల్‌ ఇస్తోంది.