NIFTY TODAY: 18,120 దాటుతుందా?
రోజూ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళు సాగుతున్నాయి. నిఫ్టికి అధిక స్థాయిలో ఒత్తిడి వస్తున్నా.. దిగువ స్థాయిలో కొనుగోళ్ళ మద్దతు అందడం కొనసాగుతోంది. నిన్న మార్కెట్‌కు కీలక స్థాయి అయిన 18000ని దాటింది. నిఫ్టి ఇవాళ 18100 ప్రాంతంలో ప్రారంభమౌతున్నా… టెక్నికల్‌గా నిఫ్టి ఇవాళ కాస్త బలహీనంగా ఉంది. మార్కెట్‌ను ప్రభావితం చేసే పెద్ద వార్తలు కూడా లేవు. ఇలాంటి సమయంలో పూర్తిగా టెక్నికల్స్ పరంగా ట్రేడ్ చేయమని అంటున్నారు వీరేందర్ కుమార్. నిఫ్టికి వెంటనే 18124-18166 ప్రాంతంలో ప్రతిఘటన ఎదురు అవుతుందని ఆయన అంటున్నారు. అలాగే 17977-17932 మధ్య నిఫ్టికి మద్దతు లభించవచ్చని అంటున్నారు. నిన్న ఫలితాలు ప్రకటించిన బ్రిటానియా, అరబిందో ఫార్మా ఫలితాల ప్రభావం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=ZqsXsnxPnQo