For Money

Business News

ఈ షేర్‌ అప్పర్‌ సీలింగ్‌ దేనికి?

ఇవాళ టాటా గ్రూప్‌నకు చెందిన చాలా షేర్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా టాటా సన్స్‌ లిస్టింగ్‌. టాటా సన్స్‌ కంపెనీని లిస్ట్‌ చేయాల్సిందేనని సెబీ స్పష్టం చేయడంతో ఈ గ్రూప్‌ షేర్లు భారీగా పెరిగాయి. ఎందుకంటే టాటా సన్స్‌ విలువ సుమారు రూ. 12 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన టాటా సన్స్‌కు వాటా ఉన్న పలు కంపెనీల వ్యాల్యూ కూడా ఆ మేరకు పెరుగుతుందన్న మాట. టాటా సన్స్‌కు టాటా కెమికల్‌లో 2.53 శాతం వాటా ఉంది. దీని విలువ తాజా లెక్కల ప్రకారం రూ. 30,052 కోట్లు. ఇపుడు టాటా కెమికల్స్‌ మార్కెట్‌ క్యాప్‌ ఎంతో తెలుసా? రూ. 15,593 కోట్లు. అంటే రెట్టింపుకన్నా అధికమన్నమాట. అందుకే ఇవాళ టాటా కెమికల్స్‌ షేర్‌ ఏకంగా 20 శాతం లాభంతో అప్పర్‌ సీలింగ్‌లో ఉంది. ఇక టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్‌లో టాటా సన్స్‌కు 3.06 శాతం, టాటా స్టీల్‌లో 3.06 శాతం వాటా ఉంది. అయితే ఈ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ లక్షల కోట్ల పైనే ఉన్నందున… టాటా సన్స్‌ లిస్టింగ్‌ వల్ల ఈ కంపెనీలకు పెద్దగా ఒరిగేమీ ఉండదు. అయినా టాటా మోటార్స్‌ పీవీ ఇపుడు 5 శాతం లాభంతో ఉంది. టాటా వవర్‌, ఇండియన్‌ హోటల్స్‌ షేర్లలోకూడా టాటా సన్స్‌కు దాదాపు 1 నుంచి 2 శాతం దాకా వాటా ఉంది. ఈ షేర్లు కూడా ఇవాళ గ్రీన్‌లోఉన్నాయి. ఇక టాటా సన్స్‌ లిస్టింగ్‌తో తమ వ్యాల్యూయేషన్‌ కూడా పెరుగుతుందని షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ భావిస్తోంది. అందుకే ఆ గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌కాన్స్‌ షేర్‌ ఇపుడు 15 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది.

Leave a Reply