ఈ రేట్‌లో లారస్ ల్యాబ్ కొనొచ్చా!
ప్రస్తుత ధర వద్ద తాజాగా కొనుగోలు చేయొద్దని సలహా ఇస్తోంది ప్రముఖ రీసెర్చి సంస్థ జెఫరీస్. ఈ షేర్ టార్గెట్‌ను రూ. 2100గా పేర్కొంది. ఇంతకుమునుపు ఈ సంస్థ కంపెనీ షేర్‌ను రూ. 1,700గా పేర్కొంది. కంపెనీ ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తరవాత 2027-28లో ఈపీఎస్ 6 లేదా 4 శాతం పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇక కొటక్‌మాత్రం ఏకంగా షేర్ ధర టార్గెట్‌ను రూ. 1,400గా పేర్కొంది. వ్యాల్యుయేషన్‌పై ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గోల్డ్‌మ్యాన్ శాచ్స్ కూడా ఈ కంపెనీ షేర్ టార్గెట్‌ను రూ. 1,600గా పేర్కొంది. మరోవైపు క్వార్టర్ టు క్వార్టర్ లెక్కన చూస్తే కంపెనీ పనితీరు అంతంత మాత్రమే ఉంది. Q1తో పోలిస్తే ఆదాయం 9 శాతం పెరగ్గా, నికర లాభం కేవలం 20 శాతం మేర పెరిగింది. విస్తరణ ప్రాజెక్టులు చేపట్టడం వల్ల మున్ముందు కంపెనీ ఆదాయం, నికర లాభం పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ప్రస్తుత ధర నుంచి లారస్ ల్యాబ్ ఇప్పట్లో భారీగా పెరిగే ఛాన్స్ లేదని బ్రోకింగ్, రీసెర్చి సంస్థలు అభిప్రాయ పడుతున్నాయి. నిన్న ఈ షేర్ రూ. 2,270 వద్ద ముగిసింది. Q2లో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 126 శాతం వృద్ధి చెంది రూ. 441 కోట్లకు చేరింది. 33 శాతం వృద్దితో రూ. 2,206 కోట్లకు టర్నోవర్ చేరింది. ఈపీఎస్ కూడా 128 శాతం జంప్. రూ.6.8 నుంచి రూ. 8.2కు చేరింది. ఇక H1 FY27లో రూ. రూ. 4,233 కోట్ల టర్నోవర్‌పై రూ. 809 కోట్ల నికర లాభం సాధించింది. ఈపీఎస్ 127 శాతం పెరిగి రూ. 15కు చేరింది.ప్రస్తుత త్రైమాసికంలో వైజాగ్‌లోని LB-4 ఫర్మేంటేషన్ తయారీ ప్లాంట్ల ప్రారంభం అవుతుందని సీఈఓ సత్యనారాయణ చావా తెలిపారు. అలాగే API సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు వెల్లడించారు. ఇక కెనడా కంపెనీ గాలెన్వ్స్ సైన్సెస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 60 శాతం వాటా కొన్నామని, తరవాత పూర్తి వాటా కొంటామన్నారు. మరోవైపు
హైదరాబాద్ కంపెనీ ఎస్‌ఐ అండ్ సీ రెసిన్స్‌లో 52% వాటా కొనుగోలు
చేసినట్లు కంపెనీ వెల్లడించింది
