మార్కెట్లకు కొత్త గండం!
ఇప్పటి వరకు ఏఐ, క్రూడ్, బాండ్ ఈల్డ్స్‌తో ఇబ్బందులు పడ్డం ఈక్విటీ మార్కెట్లకు ఇపుడు కొత్త గండం వస్తోంది. ఈసారి వడ్డీ రేట్లు మార్కెట్‌కు ఇబ్బంది కల్గించే ఛాన్స్ ఉంది. రేపు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే ఛాన్స్ ఉంది. ఇక మన దేశంలోనూ ద్రవ్యోల్బణం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతోవ వచ్చే నెలలో ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను పెంచవచ్చని ఎస్బీఐ రీసెర్చితో పాటు పలు రీసెర్చి సంస్థలు అంచనా వేస్తున్నాయి.ఇవాళ మార్కెట్లో గ్రీన్‌లో ప్రారంభమైనా… లాభాలు నిలుస్తాయా అన్న అనుమానం కల్గుతోంది. అయితే ఇవాళ ఐటీ షేర్లలో గట్టి ర్యాలీ వచ్చే పక్షంలో మార్కెట్ గ్రీన్‌లో నిలబడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఐటీలో ర్యాలీ వస్తే రియాల్టి, బ్యాంకుల్లో కూడా జోష్ వచ్చే ఛాన్స్ ఉంది.అయితే పెరిగిన వెంటనే ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ వస్తోంది. అంతర్జాతీయంగా ఏఐ కంపెనీలపై అనుమానాలు రావడంతో… ఐటీపై ఆసక్తి పెరుగుతోంది. అయితే ఒరాకిల్ సంస్థ ఇవాళ ఏకంగా పది వేల మందిని తొలగించింది. దీంతో ఐటీపై మార్కెట్ పాజిటివ్‌గా స్పందించినా…. లాభాల కొనసాగింపుపై అనుమానాలు ఉన్నాయి. ఇవాళ టాటా గ్రూప్‌లు పలు షేర్లు గ్రీన్‌లో ఉండొచ్చు. టాటా సన్స్ లిస్టింగ్ తప్పదని వార్తలు వస్తున్న నేపథ్యంలో… టాటా సన్స్‌కు వాటా ఉన్న పలు కంపెనీలు బాగా లబ్ద పొందే అవకాశముంది. అందులో టాటా కెమికల్స్ ముందు ఉంది. దీనికి కారణం.. కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.15000 కాగా, టాటా సన్స్ లిస్టింగ్ వల్ల ఈ కంపెనీకి రూ.30000 కోట్ల లాభం కలిగే అవకాశముంది. అలాటా టాటా ఇన్వెస్ట్మెంట్ కూడా. ఎన్ఎస్ఈ పబ్లిక్ ఆఫర్ నేపథ్యంలోబీఎస్ఈతో పాటు ఇతర క్యాపిటల్ మార్కెట్ సంబంధిత షేర్లలో ర్యాలీకి ఛాన్స్ ఉంది. ఇక పేమెంట్ చార్జీలపై కేంద్రం నుంచి త్వరలోనే ప్రకటన రానుంది. దీంతో పేటీఎం ఇంకా పెరగే ఛాన్స్ ఉంది. నష్టాలు పొందే షేర్లలో ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ ముందున్నాయి. గోల్డ్ ధరలు బాగా తగ్గడమే దీనికి కారణం. ఇక కోఫోర్జ్‌లో జరుగుతున్న పరిణామాలకు ఆ షేర్ ప్రతికూలంగా స్పందించవచ్చు. ఇవాళ అనేక బ్రోకింగ్ సంస్థలు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు మద్దతుగా నిలిచాయి.టార్గెట్‌ను రూ. 880 నుంచి రూ. 1060 వరకు వచ్చాయి.
