For Money

Business News

అన్నీ మార్కెట్లలో జోష్‌… మనం తప్ప

ప్రపంచ మార్కెట్లన్నీ జోరు మీద ఉన్నాయి. ముఖ్యంగా వాల్‌స్ట్రీట్‌ పరుగులు పెడుతోంది. ఏఐ పని అయిపోయిందని పదే పదే వస్తున్న వార్తలను కాదని నాస్‌డాక్‌ రాత్రి ఒక శాతంపైగా లాభంతో ముగిసింది. ముఖ్యంగా ఆంథ్రోపిక్‌ ఐపీఓ మార్కెట్‌లో కొత్త జోష్‌ తెచ్చింది. ఈ ఐపీఓకు సమాన మొత్తాన్ని సమీకరించాలని ఇపుడు మెటా భావిస్తోంది. ఎన్‌విడియాతో డీల్స్‌ పెరుగుతున్నాయి. ఏఐ పెట్టుబడులపై ఒకవైపు ఆందోళన వ్యక్తం అవుతుండగా, కంపెనీలు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో నిధులు సమీకరిస్తున్నాయి. దక్షిణ కొరియాకు SK Hynix Q3లో అదరగొట్టింది. అనూహ్య రీతిలో ఫలితాలు ప్రకటించింది. ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ 632% పెరిగింది. ఇక టర్నోవర్‌లో 328% వృద్ధి చెందినట్లు కంపెనీ వెల్లడించింది.ఈ ఏడాది తాము తమ వాటాదారులకు
7,550 కోట్ల డాలర్లు ఇవ్వనున్నట్లు SK Hynix వెల్లడించింది. దీంతో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మంచి జోష్‌లో ఉన్నాయి. కోప్సి 6 శాతంపైగా లాభంతో ఉంది. ఇతర ఆసియా మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. మన మార్కెట్లు మాత్రం భారీ నష్టాల్లో ప్రారంభం కానున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టి ఏకంగా 200 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. రాత్రి భారత ఐటీ కంపెనీల ఏడీఆర్‌లు నష్టాల్లో ముగిశాయి. సో… ఇవాళ కూడా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి రానుంది. క్రూడ్‌ 115 డాలర్లపైనే ఉండటంతో పాటు అనూహ్యంగా డాలర్‌ బలపడటంతో ఇవాళ బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో ఒత్తిడి వచ్చే అవకాశముంది. నిన్న అక్టోబర్‌ డెరివేటివ్స్‌ కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్ళు చేశారు. ఇవాళ మళ్ళీ అమ్మకాలు ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉంది. మన మార్కెట్‌లో ఇవాళ ఏఐ రంగానికి చెందిన షేర్లలో లాభాలు వచ్చే అవకాశముంది. అలాగే పవర్‌ సెక్టార్‌కు చెందిన షేర్లు కూడా వెలుగులో ఉండొచ్చు. లోకల్‌ షేర్లలో స్టాండర్డ్‌ ఇంజినీరింగ్, మాస్‌చిప్‌తో పాటు అపోలో మైక్రో షేర్లను గమనించండి. అలాగే ఇండో ఎంఐఎం షేర్‌ కూడా. కెమికల్‌ షేర్లలో కూడా కొనుగోళ్ళ ఆసక్తి కనబడే ఛాన్స్‌ ఉంది.

Leave a Reply