ఇక ఫార్మానే దిక్కు…
మార్కెట్ ఇవాళ భారీ నష్టాల్లో ప్రారంభం కానుంది. మే నెల తరవాత కనిష్ఠ స్థాయికి చేరే ఛాన్స్ అధికంగా ఉంది. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్ మంచి జోష్‌పై ఉన్నారు. ఇపుడు క్రూడ్ అమ్మకాల్లో ప్రపంచ దేశాల్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న అమెరికా అధిక ధరల వల్ల బాగా లబ్ది పొందుతోంది. క్రూడ్ ధరలు పెంచేందుకే దాడులు జరుపుతున్నట్లు కన్పిస్తోంది. అధిక ధరలంటూ జనం నుంచి వస్తున్న వ్యతిరకతను 5000 డాలర్ల ఆఫర్‌తో ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. బాండ్ ఈల్డ్స్ భారీ పెరగడంతో అమెరికా మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి కన్పిస్తోంది. వచ్చే వారం ఫెడ్ కూడా వడ్డీ రేట్లు పెంచడం ఖాయంగా కన్పిస్తోంది. క్రూడ్ 110 డాలర్లకు చేరడంతో మన మార్కెట్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఒకవైపు డాలర్ల కోసం పెరగడంతో పాటు వృద్ధి అంచనాలు గాడి తప్పే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం వెల్లడిస్తున్న డేటాపై అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు మార్కెట్‌ను కలవర పరుస్తున్నాయి. ఇపుడు ఒక్క ఫార్మా తప్ప మరే రంగమూ పెద్దగా ఆశాజనకంగా లేదు. మెటల్స్ కూడా రాత్రి బాగా పడ్డాయి. ఐటీ షేర్లకు మద్దతు అందుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఐటీతో పాటు రియల్ ఎస్టేట్ షేర్లు బాగా రియాక్ట్ అవుతాయి. ఇక ఆయిల్‌తో సంబంధం ఉన్న అన్ని రంగాలపై ఒత్తిడి పెరుగుతోంది. NBFCలపై కూడా ప్రభావం ఉండొచ్చు. గోల్డ్‌లోన్ షేర్లలో పతనం కొనసాగవచ్చు. లలితా జువలరీస్‌లో యాక్టివిటీ తగ్గొచ్చు. ఇక CNBC ఆవాజ్ ఛానల్ ఇవాళ ఛార్ట్ ఆధారంగా చాలా వరకు ఫార్మా షేర్లను కొనమని సలహా ఇచ్చింది. వీటిలో Nifty pharma, Laurus Lab, IPCA Labs, Jubliant Pharma ఉన్నాయి. అలాగే బిగ్ స్టాక్స్ కింద చాలా వరకు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్క Vodafone Idea షేరు మాత్రమే గ్రీన్‌లో ఉంచింది. Muthoot finance, Manappuram, Hindustan Zinc, Oil, ONGC, Asian paitns, Interglobe Aviation షేర్లలో అమ్మకాలను సూచించింది. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉన్నందున… దిగువస్థాయిలో మద్దతు అందుతుందేమో చూడాలి.
