For Money

Business News

హిందూపురం ప్లాంట్‌ ప్రారంభం

ఏషియన్‌ పెయింట్స్‌ హిందూపురం ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభానికి రంగం సిద్ధమైంది. బుధవారం తమ ప్లాంట్‌ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు ఏషియన్‌ పెయింట్స్‌ వెల్లడించింది. ఏటా 36వేల టన్నుల పెయింట్‌ను తయారు చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కుఉంది. సుమార రూ. 188 కోట్లతో ఈ ప్లాంట్‌ను కంపెనీ నెలకొల్పింది. తమది పూర్తిగా ఆటోమేటెడ్‌ సాల్వెంట్‌ బేస్డ్‌ పెయింట్‌ ప్లాంట్‌ అని కంపెనీ వెల్లడించింది. హిందూపురం సమీపంలోని తూముకుంట గ్రామంలో ఈ ప్లాంట్‌ ఉన్నట్లు పేర్కొంది.

Leave a Reply