For Money

Business News

సుభాష్‌ చంద్రకు షాక్‌

రూ. 22,000 కోట్ల రుణం నుంచి బయటపడాలని చూసిన జీ గ్రూప్‌ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్రకు NCLT విస్తృత ధర్మాసనం షాక్‌ ఇచ్చింది. ఈ రుణ కేసును రూ. 6.25 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని ఇచ్చిన తీర్పుపై అయిదుగురు సభ్యులతో కూడిన NCLT ధర్మాసనం స్టే విధించింది. రుణ చెల్లింపు ప్రణాళికకు 80.81 శాతం రుణదాతుల ఆమోదం తెలపడంతో తాము ఆమోదించామని NCLT ద్విసభ్య ధర్మాసనం ఇంతకుమునుపు తీర్పు ఇచ్చింది. అయితే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన కంపెనీలన్నీ జీ గ్రూప్‌తో సంబంధం ఉన్న కంపెనీలే కావడంతో… దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల అప్పీల్‌కు వెళ్ళాయి.