For Money

Business News

IDBI బ్యాంకులో CSB బ్యాంక్‌ విలీనం?

రెండు బ్యాంకులపై ఒకరి పెత్తనం ఉండటకూడదనే నిబంధనతో ఐడీబీఐ బ్యాంక్‌లో సీఎస్‌బీ బ్యాంక్‌ విలీనానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతోఒక సీఎస్‌బీ బ్యాంకు షేరుకు నాలుగు ఐడీబీఐ బ్యాంకు షేర్లు ఇచ్చేలా నిష్పత్తి ఖరారు చేశారు. అలాగే ఐడీబీఐ బ్యాంక్‌ వాటాదారులకు ఫెయిర్‌ ఫ్యాక్స్‌ త్వరలోనే ఓపెన్‌ ఆఫర్‌ కూడా ప్రకటించనుంది. ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను రూ. 53,000 కోట్లకు అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం నిన్న ఆమోదం తెలిపింది. కేంద్రానికి మిగిలి ఉన్న వాటాను ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయించనుంది. కెనడాకు చెందిన బిలినీయర్‌ ప్రేమ్‌ వత్సాకు చెందిన ఫెయిర్‌ ఫాక్స్‌ కంపెనీ ఇప్పటికే పలుమార్లు కేంద్రంతో చర్చలు జరిపిన తరవాత వాటా విక్రయానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Leave a Reply