For Money

Business News

రికార్డు స్థాయిలో అమ్మకాలు

యాపిల్‌ కంపెనీ Q2లో కూడా 20 శాతంపైగా వృద్ధి సాధించి రికార్డు నెలకొంది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ అమ్మకాలు 11,118 కోట్ల డాలర్లకు చేరాయి. దాదాపు మార్కెట్‌ అంచనాలకు దగ్గరగా ఉన్నాయి. అలాగే ఒక్కో షేర్‌కు 2.01 డాలర్ల లాభాన్ని కంపెనీ ప్రకటించింది. అయితే షేర్‌ ధర మాత్రం ఆరంభంలో పెరిగినా.. తరవాత చాలా వరకు లాభాలు తగ్గాయి. మూడో త్రైమాసికంలో అమ్మకాలు గరిష్ఠంగా 17 శాతం పెరగవచ్చని కంపెనీ అంటోంది. ఐఫోన్‌ 17 అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. మార్జిన్స్ మాత్రం మార్కెట్‌ అంచనాలను మించింది. 49.27 శాతం మార్జిన్‌ను కంపెనీ సాధించింది. ప్రస్తుతం కంపెనీ వద్ద 5400 కోట్ల డాలర్ల నికర నగదు ఉన్నట్లు తెలిపింది. అలాగే మార్కెట్‌ అంచనాలకు మించిన చైనాలో 2,050 కోట్ల డాలర్ల విలువైన ఐఫోన్స్‌ను కంపెనీ విక్రయించింది. 10,000  డాలర్లతో షేర్ల బైబ్యాక్‌ను కంపెనీ ప్రకటించింది.

Leave a Reply