For Money

Business News

ఏఐ షేర్లకు ఓపెన్‌ ఏఐ షాక్‌?

ఓపెన్‌ ఏఐ కంపెనీ వృద్ధి అవకాశాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది చివరల్లో పబ్లిక్‌ ఇష్యూ రావాలని అనుకుంటున్న ఒపెన్‌ ఏఐపై ఇపుడు అనేక వార్తలు వస్తున్నాయి. కంపెనీ అనుకున్న విధంగా యూజర్స్‌ను సాధించలేకపోతోందని, టార్గెట్‌ ఆదాయం కూడా రావడం లేదంటూ ద వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక రాసిన వ్యాసం ఇపుడు మార్కెట్‌ను షేక్‌ చేస్తోంది. చాట్‌జీపీటీకి వంద కోట్ల వీక్లీ యాక్టివ్‌ యూజర్స్‌ సాధించాలని కంపెనీ అంతర్గతంగా టార్గెట్‌ పెట్టుకున్నట్లు ఆ పత్రిక రాసింది. అయితే అనుకున్న విధంగా టార్గెట్‌ను సాధించలేదని తెలిపింది. అనుకున్న స్పీడ్‌తో ఆదాయం పెరగకపోతే… భవిష్యత్‌ డేటా సెంటర్ల కాంట్రాక్ట్‌లకు కంపెనీ నిధులు సమకూర్చలేదని భావిస్తున్నారు. ఇటీవల కుదుర్చుకున్న డేటా సెంటర్ల డీల్స్‌పై కూడా కంపెనీ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు ద వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఈ ఏడాది చివర్లో పబ్లిక్‌ ఇష్యూ రావాల్సి ఉంది. దీంతో వ్యయ నియంత్రణపై కంపెనీ ఫోకస్‌ పెట్టింది.

Leave a Reply