నష్టాల్లో ఉన్నా…
ఇవాళ మార్కెట్ నష్టాల్లో ఉన్నట్లు ఉన్నా.. అవి కేవలం కొన్ని రంగాలకు పరిమితం కావడంతో.. ఇతర రంగాల షేర్లు ఆకర్షణీయ లాభాల్లో ట్రేడవుతున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు నిరుత్సాహంగా ఉండటంతో మొత్తం ఐటీ షేర్లు నష్టాల్లో జారుకున్నాయి. ఇతర ఐటీ షేర్ల ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిఫ్టి 50లో టాప్ లూజర్స్‌లో టాప్ నాలుగు షేర్లూ ఐటీ రంగానికి చెందినవే. పది శాతంపైగా నష్టంతో హెచ్‌సీఎల్ టెక్ ట్రేడవుతోంది. ఇక రియాల్టి రంగంలో జోరు సాగుతోంది. ఇక నిన్నటి నెస్లే ఫలితాలు ఇతర ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. టాటా కన్జూమర్ ఇవాళ నిఫ్టి 50లో టాప్ గెయినర్‌గా నిలిచింది. అలాగే హిందుస్థాన్ లీవర్ కూడా. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కూడా 3 శాతంపైగా లాభంతో ఉంది. ఇక తీవ్ర వేసవి కారణంగా విద్యుత్‌కు ఎక్కడ లేని డిమాండ్ వస్తోంది. పవర్ సెక్టార్ కంపెనీలతో పాటు ఎన్‌టీపీసీలో ఇవాళ భారీ ఆసక్తి కన్పిస్తోంది. నెస్లే ఇవాళ కూడా రెండు శాతంపైగా లాభంతో ఉంది.
